ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ తగిలి నలుగురు యువకులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా.. మృతి చెందిన వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
గాయాలపాలైన వారికి చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.విగ్రహావిష్కరణ ఏర్పాట్లలో ఇలాంటి ఘటన జరగడం విషాదకరమన్నారు.బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు.తణుకు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.