వైఎస్ వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు !

వైఎస్ వివేకా హత్యపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ చిన్నాన్న వివేకా గురించి చంద్రబాబు మాట్లాడతాడని.. వివేకా నాకు చిన్నాన్న, చంద్రబాబుకి కాదని పేర్కొన్నారు. సొంత మా నాన్న తమ్ముడని.. ఇంకోవైపు అవినాష్‌రెడ్డిపైన ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అవినాష్‌రెడ్డి మరో చిన్నాన్న కొడుకని.. ఎవరైనా అలాంటి ఘటన ఎందుకు చేస్తారు అధ్యక్షా ? అని ప్రశ్నించారు సిఎం జగన్. మన చేయితో మనకున్న కంటిని ఎందుకు పొడుచుకుంటామని.. వివేకా హత్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందన్నారు.

అప్పుడు మేం ప్రతిపక్షంలో ఉన్నామని.. మా చిన్నాన్న, అవినాష్‌రెడ్డి కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారన్నారు. మా చిన్నాన్నను ఓడించడం కోసం చేసిన అక్రమాలు అన్నీఇన్నీకావని.. కడప జిల్లాలో అప్పుడు ఎంపీటీసీలు, జడ్పీసీలు మాకు ఎక్కువ ఉన్నారని తెలిపారు. మా చిన్నాన్నను ఏదైనా చేసి ఉంటే.. అది వాళ్లే చేసి ఉండాలని ఆరోపణలు చేశారు. అటువంటి దాన్ని ట్విస్ట్‌చేసి, వక్రీకరించి.. ఏదేదో చేస్తున్నారని.. చివరకు మా కుటుంబంలోనే చిచ్చుపెట్టే కార్యక్రమాలను చేస్తున్నారని అగ్రహించారు. ఇలాంటి విషయాలు మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుందని.. అలాంటి విషయాలను కూడా ఇక్కడ రాజకీయంగా ట్విస్ట్‌చేసి, రాజకీయంగా మాట్లాడతారని నిప్పులు చెరిగారు. ఏవేవో చెప్పే కార్యక్రమాలుచేస్తారని.. ఇది చాలా దురదృష్టకరమన్నారు. అయినా పైనా దేవుడు ఉన్నాడు.. ఆయనే చూస్తాడని సిఎం జగన్ పేర్కొన్నారు.