ఏపీలో సీఎం జగన్ తమ మార్క్ పాలనను కొనసాగిస్తున్నాడు. అస్సలు తన పాలనపై ప్రజల్లో ఇంతటి పోజిటివిటీ ఏర్పడడానికి ప్రధాన కారణం వార్డ్ వాలంటీర్లు మరియు సచివాలయ వ్యవస్థే. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నియమించిన 5 లక్షల మంది వాలంటీర్లు సక్రమంగా వారి వారి బాధ్యతలను నిర్వర్తించడం మూలంగానే ఇప్పుడు ఇంతటి సక్సెస్ జగన్ సాధించగలిగాడు. అయితే వాలంటీర్ల సేవకు మెచ్చిన జగన్ ప్రతి సంవత్సరం వారికి ప్రోత్సాహకాలను అందిస్తూ వస్తున్నారు, అందులో భాగంగా ఈ సంవత్సరం సైతం వారికి వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమం ద్వారా ఉత్తమ సేవలను అందించిన వారిని ఎంపిక చేసి నగదు బహుమతులను ఇస్తారు. ఇప్పటికే జిల్లాల వారీగా వాలంటీర్ల లిస్ట్ ను రెడీ చేసింది ప్రభుత్వం.
సీఎం జగన్ గుడ్ న్యూస్… వాలంటీర్లకు నగదు బహుమతులు !
-