ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి జిల్లా వెంకటగిరిలో బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు ప్రతి సంవత్సరం అందించి నేతన్న నేస్త పథకం కింద అమౌంట్ ను అందిస్తూ వస్తున్నారు. ఈ ప్రభుత్వంలో చివరిసారిగా ఈ రోజు ప్రతి ఒక్క నేతన్న ఖాతాలో రూ. 24 వేలు బటన్ నొక్కి ట్రాన్స్ఫర్ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అర్హత కలిగిన 80686 మందికి రూ. 194 కోట్లు చెల్లిస్తున్నారు. జగన్ మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అమౌట్ చెల్లిస్తున్నాము. గత ప్రభుత్వ హయాంలో నేతన్నలకు తగినంత సాయం అంధక ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితిని చూశాము అంటూ చంద్రబాబు అసమర్ధతను ప్రజలకు గుర్తు చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఏ ఒక్కరూ బాధపడే పరిస్థితి లేదు.. వారికీ అన్ని విధాలుగా అండగా ఉంటూ సహాయసహకారాలు అందిస్తున్నాము అంటూ జగన్ తెలిపారు.
మన ప్రభుత్వంలో ప్రతి ఒక్క నేతన్నకు ఆర్ధిక సాయం: సీఎం జగన్
-