అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు శాశ్వతమైన ప్రాజెక్టు : సీఎం జగన్‌

-

విజయవాడలో అంబేద్కర్‌ స్మృతి వనం పనుల పై సీఎం సమీక్షించారు. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణ పనుల్లో పురోగతి పైనా సమీక్ష నిర్వహించారు. సివిల్‌ వర్క్స్, సుందరీకరణ పనుల పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. స్మృతివనంతో పాటు విగ్రహం నిర్మాణ పనులపై సీఎంకు వివరాలందించారు అధికారులు. స్మృతివనం ప్రాంగణంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయని అధికారులు వివరించారు. అన్ని స్లాబ్‌ వర్కులు ఈ నెలాఖరు నాటికి పూర్తవుతాయన్న అధికారులు సీఎంకు తెలిపారు. ప్రాంగణంలో ఒక కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా వస్తుందని, విగ్రహ విడిభాగాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయన్న అధికారులు.. ఒక్కొక్కటిగా అమర్చుకుంటూ మొత్తం 13 దశల్లో విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేస్తామన్నారు.

Ambedkar Smriti Vanam: Constitute high-level panel to monitor progress says  CM YS Jagan

విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్‌ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్‌ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామని, విగ్రహం తయారీతో పాటు దాని చుట్టూ సివిల్‌ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే పనులను సీఎంకు వివరించారు అధికారులు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు శాశ్వతమైన ప్రాజెక్టు అన్నారు. పనులు కూడా అంతే నాణ్యతతో ఉండాలని, విజయవాడకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చేలా నిర్మాణాలు ఉండాలన్నారు. అంతేకాకుండా.. స్మృతివనంలో ఏర్పాటవుతున్న కన్వెన్షన్‌ సెంటర్‌ కూడా అత్యంత ప్రధానమైనది. నిర్మాణంలో నాణ్యతతో పాటు, సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. అధికారులు పనులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి. పనుల పర్యవేక్షణకోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్ధాయి కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి’ అని జగన్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news