Breaking : రేపు నరసాపురంలో సీఎం జగన్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే

-

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ రేపు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. నరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు సీఎం జగన్‌. ఈమేరకు రేపటి సీఎం జగన్‌ నరసాపురం పర్యటన షెడ్యూల్‌ ఇలా ఉంది. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉదయం 10.50 గంటలకు సీఎం జగన్‌ నరసాపురం చేరుకోనున్నారు. ఉదయం 11.15 గంటల నుంచి 12.50 గంటల వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్‌ పాల్గొనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.15 గంటలకు బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి చేరుకోనున్నారు సీఎం జగన్‌. అయితే.. ఫిషింగ్‌ హార్బర్‌.. ఆక్వా యూనివర్సిటీ.. ఉప్పుటేరుపై రెగ్యులేటర్‌ నిర్మాణం.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి 12 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగనున్నాయి.

Andhra Pradesh: CM YS Jagan Mohan Reddy announces hike in old age pensions

రికార్డు స్థాయిలో రూ.3,300 కోట్లకుపైగా వ్యయంతో నిర్వహించే పనులకు అన్ని అనుమతులు పూర్తయ్యాయి. అది కూడా మొత్తం ఒకే నియోజకవర్గంలో జరిగే పనులు కావడం విశేషం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో ఎన్నడూలేని విధంగా నరసాపురం నియోజకవర్గంలో రూ.3,300 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు ఈనెల 21న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news