మోడీ సర్కార్ కంటే.. ఏపీ ఆర్ధిక వ్యవస్థ మెరుగ్గానే ఉంది – సీఎం జగన్ సంచలన ప్రకటన

-

గత ప్రభుత్వమే కాదు.. కేంద్రంతో పోల్చి చూసినా ఏపీ చేసిన అప్పు గణనీయంగా తగ్గిందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. గత ప్రభుత్వం, కేంద్రం కంటే మెరుగ్గానే ఏపీ ఆర్ధిక వ్యవస్థ ఉందని.. అన్ని రకాలుగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని పరిస్థితులు మెరుగ్గా లేదని దుష్ప్రచారం జరుగుతోందని ఫైర్‌ అయ్యారు. రాష్ట్రం బాగున్నా శ్రీలంక తరహాలో పరిస్థితులు ఉన్నాయని కొందరు లేనిది సృష్టిస్తున్నారని.. కోవిడ్ ఉన్నా ఏపీ స్థూల ఉత్పత్తి గణనీయంగానే పెరిగిందని వెల్లడించారు. ఇవాళ అసెంబ్లీలో ఏపీ ఆర్థిక వ్యవస్థపై సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 2021-22లో 11.43 శాతం జీఎస్డీపీ పెరుగుదలతో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.. గడచిన మూడేళ్లలో సగటున 5 శాతం పెరిగిందని తెలిపారు.

ఏపీతో సహా నాలుగు రాష్ట్రాల్లో తలసరి ఆదాయ వృద్ధి కనిపిస్తే మిగతా రాష్ట్రాల్లో తిరోగమనంలో ఉన్నాయి… కొనుగోలు శక్తి పడిపోకుండా అమ్మఒడి, చేయూత, ఆసరా, రైతు భరోసా లాంటి పథకాలు పనికి వస్తున్నాయని వివరించారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా మూల ధన వ్యయం చేస్తున్నాం… అసాధారణ స్థాయిలో అప్పులు చేస్తున్నారని విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇందులో నిజం ఎంతుందో ప్రజలంతా తెలుసుకోవాలి… గతంలో రుణాల పెరుగుదల సాలీనా 17.4 శాతం ఉంటే ప్రస్తుతం 12.7 శాతం మాత్రమే పెరుగుదల ఉందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రూ. 3,82,165 కోట్లు మాత్రమే రుణాలు అని.. ప్రభుత్వ గ్యారెంటీలతో కార్పోరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు రూ. 1,17,730 కోట్లు.. మొత్తం అప్పు రూ. 4,99,895 కోట్లకు చేరాయని తెలిపారు.

మూడేళ్లలో పెరిగిన రాష్ట్ర రుణం 52.07 శాతం మాత్రమే.. జీడీపీలో రుణ శాతం దేశ సగటుతో పోలిస్తే గణనీయంగా తగ్గిందన్నారు. కేంద్ర రుణాలు- రాష్ట్ర రుణాలూ పెరిగిన తీరును చూసినా ఏపీ పనితీరు అవగతం అవుతుంది… రాష్ట్రం విడిపోయే నాటికి రాష్ట్ర రుణం రూ. 1.20 లక్షల కోట్లు ఉంటే చంద్రబాబు హయాంలో రూ. 2,69,462 కోట్లకు పెరిగాయని చెప్పారు. అంటే చంద్రబాబు ప్రభుత్వం 123.53 శాతం మేర రుణాలు పెరిగాయని.. 2019 మే 31 తేదీనాటికి ఉన్న ఏపీకి ఉన్న అప్పులు రూ. 2,69,462 కోట్లుగా ఉందని స్పష్టం చేశారు. మూడేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022 మార్చి 31 నాటికి ఉన్న రుణం 3,82,165 కోట్లు మాత్రమేనని కుండ బద్దలు కొట్టి చెప్పారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news