ఈ నెల 27వ తేదీన తిరుమల సన్నిధికి సీఎం జగన్

-

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రంగం సిద్దం చేసింది టీటీడీ పాలక మండలి. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5వ తేది వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ విషయాన్ని టీటీటీ పాలక మండలి అధికారిక ప్రకటన చేసింది. 26 వ తేదిన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది.

ఇందులో భాగంగానే.. అక్టోబర్ 1వ తేదిన గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు టీటీటీ పాలక మండలి. అక్టోబర్ 5వ తేదిన చక్రస్నానం జరుగనుంది. ఇక ఈ నెల 27వ తేదీ సాయంత్రం ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి వార్షిక బ్రహ్మోత్సవాలు. 27వ తేదీ రాత్రి శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్న సీఎం జగన్.. శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఇది ఇలా ఉండగా.. ఇవాళ ఆన్ లైన్ లో అక్టోబర్ మాసానికి సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చెయ్యనుంది టీటీడీ. బ్రహ్మోత్సవాల కారణంగా అక్టోబర్ 1 నుంచి 5వ తేది మినహాయించి మిగిలిన తేదీలకు టోకెన్లు విడుదల చెయ్యనుంది. ఎల్లుండి టీటీడీ పాలకమండలి సమావేశం జరుగనుండగా…రూ.100 కోట్ల వ్యయంతో యాత్రికుల వసతి సముదాయం, రూ.33 కోట్ల వ్యయంతో అదనపు క్యూ లైన్లు నిర్మాణానికి ఆమోదం తెలపనుంది పాలకమండలి.

Read more RELATED
Recommended to you

Latest news