మద్య పానం నిషేధంపై సీఎం జగన్ కీలక ఆదేశాలు చేశారు. ఎక్సైజ్ శాఖపైన తాజాగా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అక్రమ మద్యం తయారీ, రవాణాలను నిరోధించాలన్నారు. బెల్టుషాపులు, గ్రామాల్లో అక్రమ మద్యం నిరోధంలో మహిళా పోలీసులది కీలక పాత్ర అని వెల్లడించారు.
దీనిపై గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుకు సంబంధించి ఒక ఎస్‌ఓపీ రూపొందించాలని ఆదేశించారు. అక్రమ మద్యం తయారీ, అమ్మకాలకు సంబంధించి క్రమం తప్పకుండా వారి నుంచి నివేదికలు తీసుకోవాలని పేర్కొన్నారు.
అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్న సీఎం…. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, ఎమ్మార్వో, ఎండీఓ, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాలతో పాటు అవినీతి జరగడానికి అవకాశం ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై మరింత ఫోకస్ పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. 14400 ఏసీబీ నెంబరుతో పోస్టర్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు జగన్.