ఆరుకాలం శ్రమించిన రైతన్నను అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. గత రెండు మూడు రోజుల నుంచి తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట నేలపాలయింది. ఇంకా వారం పది రోజులు అయితే కోతలు అయిపోయి యాసంగి పంట ఇంటికి చేరేది. ఈ లోపే అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేశాయి. దీంతో… అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
వర్షాకాలం సాగుకోసం వ్యవసాయశాఖ కార్యాచరణపై కేసీఆర్ చర్చించారు. ధాన్యం సేకరణ, అకాల వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులతో చర్చించారు. మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకుంటామని ఈ సమావేశంలో నిర్ణయించారు.