Breaking : పొలంలో ఇరుక్కుపోయిన ప్రధాని మోడీ హెలికాప్టర్

-

ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక పర్యటనలో భద్రతా లోపం తలెత్తింది. ఆయన ప్రయాణిస్తున్న వాయుసేన హెలికాఫ్టర్ హెలిప్యాడ్ వద్ద బురదలో కూరుకుపోయింది. ల్యాండ్ అయిన సమయంలోనే బురదలో కూరుకుపోవడంతో ఎస్పీజీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రధాని హెలికాఫ్టర్ ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని ఎందుకు తనిఖీ చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అధికారులు, సిబ్బంది హెలికాఫ్టర్‌ను బురదలోంచి బయటకు తీసేందుకు నానా తంటాలు పడ్డారు.

రాయచూర్ జిల్లా సింధనూరు వద్ద ఓ సభలో పాల్గొనేందుకు మోదీ వచ్చారు. హోసళ్లి క్యాంపు సమీపంలోని ఓ వరిపొలంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. కానీ ఆ పొలం ఇంకా చిత్తడిగానే ఉండడంతో, ల్యాండైన హెలికాప్టర్ మళ్లీ గాల్లోకి లేవలేకపోయింది.
దాంతో, ఓ జేసీబీ, 100 మంది మనుషుల సాయంతో హెలికాప్టర్ ను బురద నుంచి బయటికి తీసుకువచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది తప్పిదం వల్లే ప్రధాని మోదీ ఎస్కార్ట్ హెలికాప్టర్ కు ప్రమాదం ఎదురైందని భావిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news