జీవో 111 ఎత్తివేస్తూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం: సీఎం కేసీఆర్

-

జీవో 111ను ఎత్తివేస్తూ… రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా 111 జీవోను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. మూసీ, ఈసా జంటనగరాల పరిధిలోని రెండు జలాశయాలు కలుషితం కాకుండా సీఎస్ సారథ్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఎం వెల్లడించారు. ఇది ఆ ప్రాంత ప్రజలకు శుభవార్త అని వెల్లడించారు.  దీంతో పాటు మే 20 నుంచి జూన్ 5 వరకు పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మరోసారి చేపట్టాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. దీంతో పాటు 6 కొత్త ప్రైవేటు యూనివర్సిటీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీతో పాటు నాలుగు యూనివర్సిటీలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సంబంధిత మంత్రులు ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. యూనివర్సిటీల్లో 3500 నియామకాలు చేపట్టాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. త్వరలోనే హైదరాబాద్ లో ఫార్మా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news