అధికార లాంఛనాలతో చివరి నిజాం అంత్యక్రియలు

-

హైదరాబాద్ సంస్థానం ఆఖరి నిజాం ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్’ గారి మనుమడు, నిజాం పెద్దకొడుకు ఆజమ్ ఝా, దుర్రె షెహవార్ దంపతుల కుమారుడు ముకర్రమ్ ఝా మరణం పట్ల సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. అసఫ్ జాహీ వంశానికి చెందిన చివరి, ఎనిమిదవ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ మనవడు మీర్ అలీఖాన్ ముఖరంజా బహదూర్ టర్కీలో కన్నుమూశారు. ఇస్తాంబుల్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. ముఖరంజా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.

అంతేకాదు, ముఖరంజా భౌతికకాయం హైదరాబాదుకు చేరుకున్న తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో చర్చించి అంత్యక్రియల స్థలాన్ని నిర్ణయించాలని ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ కు స్పష్టం చేశారు. ముఖరంజా నిజాం వారసుడిగా విద్యావైద్యా రంగాల్లో సేవలు అందించారని, పేదల కోసం కృషి చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు. నిజాం పెద్ద కుమారుడు అజమ్ ఝా, దుర్రే షెహవార్ దంపతులకు 1933లో ముఖరంజా జన్మించారు. ఆయన విద్యాభ్యాసం డెహ్రాడూన్, లండన్ లో జరిగింది. 80వ దశకంలో ఆయన దేశంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుపొందారు. 1971 వరకు ముఖరంజా హైదరాబాద్ యువరాజు హోదాలో ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news