రైతు కుటుంబాలకు శుభవార్త… ఉద్యమంలో మరణించిన రైతులకు తెలంగాణ సర్కార్ రూ. 3 లక్షల పరిహారం

-

రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడంతో రైతుల పోరాటం గొప్పదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. వాతావరణం, నిర్భందాన్ని ఎదుర్కొని రైతులు విజయం సాధించారన్నారు. ఉత్తర భారత దేశంలో జరిగిన రైతుల ఉద్యమంలో పెట్టిన కేసులను కేంద్ర ప్రభుత్వం బేషరతుగా ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమంలో భాగంగా చాలా మందిపై దేశ ద్రోహం కేసులను పెట్టారన్నారు. కర్ణాటకకు చెందిన దిశ అనే అమ్మాయి ట్విట్టర్ లో సంఘీభావం తెలిపితే కేసులు పెట్టారని.. వీటన్నింటిని ఎత్తేయాని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వ దుర్మార్గం వల్ల రైతుల ఆందోళనలో 750 మంది రైతుల మరణించారని … వీరందరి వివరాలను తీసుకునే పనిలో తెలంగాణ ఉందని.. వీరందరికి తెలంగాణ ప్రభుత్వం తరుపున రూ. 3 లక్షల పరిహారం అందిస్తామని వెల్లడించారు. దీనికి రూ. 22.5 కోట్ల ఖర్చు అవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం కూడా ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వండి అని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరను కూడా కేంద్రం ప్రకటించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో కనీస మద్దతు ధరకు బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news