కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో కాసేపటి క్రితమే తెలంగాణ సీఎం కేసీఆర్ భేటి అయ్యారు. అమిత్ షా నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. ఐపీఎస్ కేడర్ పోస్టులను 139 నుంచి 194కి పెంచాలని అమిత్ షాను ఈ సందర్భంగా కోరనున్నారు కేసీఆర్. మొత్తం కేడర్ బలాన్ని సాధారణంగా అనుమతి ఇచ్చే 5% పెంపునకు పరిమితం చేయకుండా 40%మేర పెంచాలని విజ్ఞప్తి చేయనున్నారు కేసీఆర్.
తెలంగాణ పోలీస్ కేడర్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పుల కు సంబంధించిన ప్రతి పాదనలను ఇప్పటి కే కేంద్ర హోం శాఖకు పంపింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఐపీఎస్ కేడర్ పోస్టుల కేటాయింపులు జరిపితే ఐపీఎస్ అధికారులను కమిషనర్లు, ఎస్పీలు, జోనల్ డీఐజీ, మల్టీజోనల్ ఐజీపీలుగా నియమించడానికి వీలవుతుందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లనున్నారు కేసీఆర్. ఐపీఎస్ కేడర్ రివ్యూను అత్యవసర అంశంగా పరిగణించి ఆమోదముద్ర వేయాలని కోరనున్నారు. కాగా.. నిన్న ప్రధాని మోడీతో కేసీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే.