తెలంగాణ సీఎం కేసీఆర్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యులర్ నేత కుమారస్వామితో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఇరువురు నేతలు సమావేశం అయ్యారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ సీఎం అందుకు తగిన విధంగా వ్యూహరచన, ఇతర పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. వారం రోజుల క్రితం బీహార్ సీఎం నితీష్ కుమార్ ని కలిసిన ఆయన నేడు కుమారస్వామి తో భేటీ అయ్యారు.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ పార్టీని ప్రకటించనున్నారు కేసీఆర్. దీనికి తోడుగా ఈ ఏడాది డిసెంబర్ లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్, కుమారస్వామి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా జాతీయస్థాయిలో తమతో కలిసివచ్చే పార్టీల గురించి ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.