తెలంగాణలో భారీ వర్షాలు.. ఢిల్లీ నుంచి కేసీఆర్‌ రివ్యూ

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నిన్న రాత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్‌ మరియు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల్లో ఏకంగా 38 సెంమీ ల వర్ష పాతం నమోదైంది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది తెలంగాణ సర్కార్.

ఇక తెలంగాణ లో పలు జిల్లాలలో కురుస్తున్న భారీ వర్షాల పై ఢిల్లీ నుండి అధికారులతో సీఎం కేసీఆర్‌ రివ్యూ నిర్వహించారు. గత కొద్దీ రోజులుగా కురుస్తున్నభారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రదాన కార్యదర్శితో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అంతేకాదు.. కలెక్టర్లతో రివ్యూ నిర్వహించాలని తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ను ఆదేశించారు సీఎం కేసీఆర్‌. దీంతో భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల కలెక్టర్లతో మరి కొద్దీ సేపట్లో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించనున్నారు సి.ఎస్. సోమేశ్ కుమార్*.

 

Read more RELATED
Recommended to you

Latest news