సిరిసిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్‌ కు చేదు అనుభవం !

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఇవాళ రాజన్న సిరిసిల్లా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్‌ కు చేదు అనుభవం ఎదురైంది. పట్టణంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ ఊహించని పరాభవం ఎదురైంది. పూజా కార్యక్రమాల అనంతరం లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశ సమయంలో రిబ్బన్‌ కటింగ్‌ కోసం… కత్తెర అందుబాటులో లేకపోవడంతో అధికారుల తీరుపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తీవ్ర అసహనంతో స్వయంగా… తన చేత్తో రిబ్బన్‌ కట్‌ చేసి.. గృహ ప్రవేశం చేశారు సీఎం కేసీఆర్‌. దీంతో అక్కడే మంత్రి కేటీఆర్‌ తో సహా పలుగురు అధికారులు షాక్‌ కు గురయ్యారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం…  తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో నిర్మించిన అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ వెళ్లారు. దాని అనంతరం సిరిసిల్లలో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనం ప్రారంభోత్సవం, సర్ధాపూర్ లో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను సీఎం కేసీఆర్‌ ప్రారంభిం చనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version