బీజేపీని వెంటాడుతాం… వేటాడుతాం- సీఎం కేసీఆర్.

-

రైతులు పండించిన ధాన్యం కొనేదాకా.. రైతులకు న్యాయం జరిగేదాకా బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతాం… వేటాడుతాం అంటూ హెచ్చరించారు సీఎం కేసీఆర్. ఈనెల 18 ధర్నా తరువాత కూడా విడవమని కేసీఆర్ సూటిగా హెచ్చిరించారు. ధర్నా తరువాత రెండు రోజుల వేచి చూస్తామని, కేంద్రం ఎంత ధాన్యం కొంటుందో స్పష్టంగా చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. యాసంగిలో వరి పంటపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీరు ధాన్యం కొనేదాకా వదిలిపెట్టేది లేదు అన్నారు.

ధర్నా తరువాత కేంద్రం నుంచి స్పష్టత రాకుంటే తెగించి కొట్లాడుతాం అని హెచ్చరించింది. వరి ధాన్యం కొనుగోలుపై ప్రధానికి, వ్యవసాయ మంత్రికి లేఖలు రాస్తా అని కేసీఆర్ అన్నారు. పార్లమెంట్ లో కూడా తమ నిరసన గళాన్ని వినిపిస్తామన్నారు. తెలంగాణలో రైతాంగానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, నీటి పన్నులు లేకుండా నీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగానే అని అన్నారు సీఎం.

Read more RELATED
Recommended to you

Exit mobile version