గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి సీఎం కేసీఆర్ బ‌ర్త్‌డే విషెస్‌

తెలంగాణ గ‌వర్న‌ర్ త‌మిళిసై సౌంద‌రరాజ‌న్‌కు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్ర‌జ‌ల త‌ర‌ఫున సీఎం కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి బ‌ర్త్‌డే విషెస్‌ను తెలిపారు. ఈ మేర‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. మరిన్ని ఏళ్ల‌పాటు ప్ర‌జ‌ల‌కు సేవ చేసే అవ‌కాశం ఆ భ‌గ‌వంతుడు మీకు ప్ర‌సాదించాల‌ని కోరుకుంటున్న‌ట్లు కేసీఆర్ స‌ద‌రు ప్ర‌క‌ట‌న‌లో ఆకాంక్షించారు.

CM KCR conveys birthday greetings to Governor Tamilisai Soundararajan

తెలంగాణ ప్ర‌భుత్వం, గ‌వ‌ర్న‌ర్‌ల మ‌ధ్య గ‌త కొంత‌కాలంగా నెల‌కొన్న విబేధాల నేప‌థ్యంలో చాలా కాలంగా కేసీఆర్ రాజ్ భ‌వ‌న్‌కే వెళ్ల‌డం లేదు. అంతేకాకుండా గ‌వ‌ర్న‌ర్ నిర్వ‌హిస్తున్న అధికారిక కార్య‌క్ర‌మాల‌కు కూడా కేసీఆర్ హాజ‌రు కావ‌డం లేదు. కేసీఆర్‌తో పాటు ఆయ‌న కేబినెట్‌లోని మంత్రులు కూడా రాజ్‌భ‌వ‌న్‌కు దూరంగానే ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో స‌రిగ్గా తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం నాడే త‌మిళిసై జ‌న్మ‌దినం కావ‌డంతో ఆమెకు బ‌ర్త్ డే విషెస్ చెబుతూ కేసీఆర్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయడం ప్రాధాన్యత సంత‌రించుకుంది.