మాజీ మంత్రి, బిజెపి పార్టీ హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ది.. నేడు పుట్టినరోజు. ఈ నేపథ్యంలోనే హుజరాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా… బిజెపి పార్టీ కార్యకర్తలు మరియు ఆయన అనుచరులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఫ్లెక్సీలు, పూలమాలతో… ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అటు బిజెపి రాష్ట్ర నాయకులు సైతం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా ఈటల రాజేందర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈటెల రాజేందర్ నిండు నూరేళ్లు బతకాలని ఆయన దీవించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు సీఎం కేసీఆర్. కాగా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్… టీఆర్ఎస్ తెగదెంపులు చేసుకుని.. గతేడాది మేలో పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరి… హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు.