సిఎస్ సోమేశ్ కుమార్ కు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

-

సిఎస్ సోమేశ్ కుమార్ కు సిఎం కెసిఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.భారీ వానలతో గోదావరి ఉగ్రరూపందాల్చి ప్రవహిస్తున్న ప్రకృతి విపత్తు నేపథ్యంలో, ఇప్పటికే సిఎం కెసిఆర్ ఆదేశాలతో వరదముంపు ప్రాంతాల్లో అన్ని రకాలుగా సహాయక, రక్షణ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సిఎం ఆదేశాలమేరకు, స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో వుంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను రక్షించే సహాయక చర్యల్లో భాగస్వాములౌతున్నారు.

ఈ నేపథ్యంలో.. వూహించని వరదలకు జలమయమౌతున్న లోతట్టు ప్రాంతాల్లో ప్రజా రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆరెఫ్ సిబ్బందిని, రెస్కూ టీం లు సహా హెలీకాప్టర్లను అందుబాటులోకి తేవాలని సిఎం కెసిఆర్ ఇప్పటికే ఆదేశించారు. ఈ మేరకు అప్రమత్తంగా వుంటూ వరదల్లో చిక్కుకున్న వారిని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగా కాపాడుతున్నది.భధ్రాచలంలో క్రేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఖమ్మం జిల్లా స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ అభ్యర్థన మేరకు హెలికాప్టర్ ను అందుబాటులో ఉంచాలని సిఎం కెసిఆర్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.

దాంతో పాటు వరదబాధితులను రక్షించేందుకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉపయోగ పడే లైఫ్ జాకెట్లు., తదితర రక్షణ సామగ్రిని ఇప్పటికే తరలించారని, అదనంగా మరిన్నింటిని తరలించాలని సిఎం ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version