ఆరు నెలల్లో సీఎం రేవంత్‌ రెడ్డికి శిక్ష పడటం ఖాయం : ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి

-

ఓటుకు నోటు కేసు ట్రయల్‌ పూర్తయిందని, మరో ఆరు నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శిక్షణ పడటం ఖాయమని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం పాలనలో ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పుకోవడం సమంజసం కాదని ఆయన అన్నారు.

 

ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఎప్పుడు ఇచ్చారు? భర్తీ ఎప్పుడు జరిగిందని కాంగ్రెస్‌ ప్రభుత్వాముపై పాడి కౌశిక్‌ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 5 సంవత్సరాలు పని చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ కోరుకుంటుందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంకి రివర్స్‌ అయ్యే అవకాశం ఉందని అన్నారు.కాంగ్రెస్‌ పార్టీలో ఏక్‌నాథ్‌ షిండే అయ్యేది రేవంత్‌ రెడ్డి అని అన్నారు. ప్రతి నిత్యం అబద్ధాలు ఆడటమే పనిగా పెట్టుకునే వాడిని పాథలాజికల్‌ లయ్యర్‌ అని అంటారని ఆయన విమర్శించారు. రోగ లక్షణ అబద్ధాల కోరు అని అర్థమని తెలిపారు. తమ నేత హరీశ్‌రావుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అసహనం వ్యక్తం చేశారు . అధికారం శాశ్వతం కాదని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version