మహాభారతాన్ని, భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ డైరెక్టర్ అద్భుతంగా తీశారు : మంత్రి కోమటిరెడ్డి

-

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన సినిమా కల్కి. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ చిత్రం థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబడుతుంది.

ఈ చిత్రాన్ని ‘ కుటుంబసమేతంగా చూసినట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మహాభారతాన్ని, భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ నాగ్ అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. లెజెండరీ నటులు అమితాబ్, కమల్ హాసన్, దీపిక నటించిన మూవీ విజువల్ వండర్ అని ట్వీట్ చేశారు. సినిమాలు విజయవంతం అయితేనే లక్షల మందికి ఉపాధి లభిస్తుందని, ప్రతిఒక్కరూ ఈ మూవీ చూడాలని కోరారు.కాగా, ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, పశుపతి , రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు. వైజయంతి మూవీ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version