గేదెతో దిగ్విజయ్ సింగ్ డాన్స్‌.. విమర్శలు వెల్లువ

-

ఇటీవల ఏఐసీసీ అధ్యక్ష పదవి బరిలోకి దిగేందుకు సిద్ధమైన దిగ్విజయ్‌ సింగ్‌ సోనియాగాంధీ ఆదేశాల మేరకు ఆ ఆలోచనను విరమించుకున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇటీవల మహారాష్ట్రలో ప్రవేశించిన సందర్భంగా పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా స్వాగతం పలికారు. కాంగ్రెస్ నేతలు గోవర్ధన పూజ పేరిట స్వాగత కార్యక్రమం నిర్వహించగా, ఆ వేడుకలో ఓ గేదెతో దిగ్విజయ్ సింగ్ ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు. అయితే దీనిపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు చేశారు.

Digvijay Singh Dance Video: तेलंगाना में भैसें के साथ डांस करते दिग्विजय  सिंह का वीडियो वायरल- Watch | 🇮🇳 LatestLY हिन्दी

గోవర్ధన పూజ ఓ గేదెతో నిర్వహిస్తారా? అంటూ ప్రశ్నించారు. కనీసం హిందువుల ప్రాథమిక ఆచారాలు కూడా తెలియకుండా, హిందువులను అమితంగా ద్వేషిస్తున్నప్పుడే ఇలాంటివి జరుగుతుంటాయని పేర్కొన్నారు. గేదెతో గోవర్ధన పూజలు నిర్వహిస్తుండడం చూస్తుంటే మన దేశ సంస్కృతి నుంచి కాంగ్రెస్ ఎలా దూరం జరిగిందో స్పష్టంగా తెలుస్తోందని
విష్ణువర్ధన్ రెడ్డి వివరించారు. అంతేకాదు, దిగ్విజయ్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను కూడా పంచుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news