స్కూల్ పిల్లల బ్యాగ్ లో కండోమ్స్..ఆ మాత్రలు..దారుణం..

-

స్కూల్ కు వెళ్ళే పిల్లలు నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతూ..ఉన్నత చదువుల కోసం ఎలాంటి కుస్తీలు పడతారు.కానీ కొంత మంది మాత్రం దారి తప్పి ప్రవర్తిస్తున్నారు..చిన్న వయస్సులోనే తప్పులు చేస్తూ వస్తున్నారు.టీనేజ్ వయసులోనే కాలేజీ కుర్రాళ్లతో పోటీ పడతూ చేయకూడని పనులు చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు.

బెంగళూరులోని ప్రైవేట్ పాఠశాలల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. విద్యార్థులు సెల్ ఫోన్స్ వాడుతున్నారని పాఠశాల యజమాన్యానికి కంప్లైంట్స్ అందడంతో బ్యాగులను చెక్ చేయడంతో దిమ్మదిరిగే విషయాలు బయటకొచ్చాయి. బెంగళూరులోని పాఠశాలల్లో విద్యార్థుల బ్యాగ్‌ల్లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు కనిపించడంతో టీచర్లు షాక్ అయ్యారు.

బెంగళూరులోని కొన్ని పాఠశాలల యాజమాన్యం పిల్లల బ్యాగుల్లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, సిగరెట్లు లాంటివి దొరకడం చర్చనీయాంశమవుతోంది. 8, 9, 10 తరగతుల విద్యార్థుల స్కూల్ బ్యాగుల్లో కండోమ్స్ తో పాటు డబ్బులు, సెల్ ఫోన్లు కూడా కనిపించాయి. ఈ సంఘటన తర్వాత అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ స్కూల్స్ ఇన్ కర్ణాటక (KAMS) బెంగళూరు పాఠశాలలను పిల్లల స్కూల్ బ్యాగ్‌లను క్రమం తప్పకుండా చెక్ చేయాలని నిర్ణయించింది.

అలాంటి తప్పులు మళ్ళీ చెయ్యకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలిసి మీటింగ్ లను ఏర్పాటు చేశారు.అవుతున్నారు. వారు కూడా తమ పిల్లల ప్రవర్తనలో మార్పును గమనిస్తున్నారు “అని ప్రిన్సిపాల్ చెప్పారు. అయితే విద్యార్థులను సస్పెండ్ చేయకూడదని పాఠశాలలు నిర్ణయించాయి. బదులుగా వారి ప్రవర్తనలో మార్పును తీసుకురావాలని, కౌన్సెలింగ్ సెషన్‌లకు పంపాలని నిర్ణయించాయి. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చలకు దారి తీసింది..పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. చిన్న వయస్సులో ఇలాంటి తప్పులు చేస్తే,పెద్దైతే ఎటువంటి తప్పులు చేస్తారో అని కొందరు ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news