తెలంగాణ రాష్ట్రంలో కరెంటు సరఫరా పై విమర్శలు చేసే కాంగ్రెస్ – బిజెపి నేతలను చెరువులో ముంచారని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. రాజగోపాల్ పేట గంగమ్మ గుడిలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఈరోజు చేపలను వదిలాం కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపలు చనిపోతున్నాయి, కనీసం బోరు వెయ్యాలని ప్రజలు అడిగేవారని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
భారతదేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చింది, కేవలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడేనని మంత్రి హరీష్ వెల్లడించారు. వ్యవసాయానికి గతంలో నీల్లు లేక ఇబ్బంది అయ్యేదని.. కానీ ఇప్పుడు నీళ్లు పుష్కలంగా ఉండడంతో కూలీలు దొరకడం లేదని, బీహార్ నుండి కూలీలు వచ్చి వరి నాట్లు వేస్తున్నారని హరీష్ రావు అన్నారు. బద్దిపడగ నుండి సిద్దిపేట వరకు రాజగోపాల్పేట మీదుగా నాలుగు లైన్ల రహదారి వేసి.. బటర్ ఫ్లై టైట్లు వేయిస్తారని మంత్రి హామీ ఇచ్చారు. దసరా పండుగ తర్వాత రెండు పడకల గదుల నిర్మాణం కోసం రూ. 3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు.