దక్షిణకొరియాలో లాంచ్‌ అయిన Samsung Galaxy Wide 6 స్మార్ట్‌ ఫోన్..!!

-

శాంసంగ్‌ నుంచి కొత్త ఫోన్‌ దక్షిణ కొరియాలో లాంచ్‌ అయింది. అదే శాంసంగ్‌ గెలాక్సీ వైడ్‌ 6 స్మార్ట్‌ ఫోన్.. గతేడాది లాంచ్ అయిన గెలాక్సీ వైడ్ 5కు తర్వాతి వెర్షన్‌గా గెలాక్సీ వైడ్ 6 లాంచ్ అయింది. గెలాక్సీ వైడ్ 5లో కూడా ఇదే ప్రాసెసర్‌ను శాంసంగ్ అందించారు.దీని ధర కూడా రూ. 20 వేల వరకూ ఉంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఇంకా ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…
శాంసంగ్ గెలాక్సీ వైడ్ 6 ధర…
దక్షిణ కొరియాలో మాత్రమే ఈ ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా లాంచ్ అయింది. అక్కడ దీని ధరను 3,49,000 వాంగ్‌లుగా సుమారు రూ.20,200గా నిర్ణయించారు.
బ్లాక్, వైట్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
దక్షిణ కొరియా ఎక్స్‌క్లూజివ్ ఫోన్ కాబట్టి మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం లేదు.
శాంసంగ్ గెలాక్సీ వైడ్ 6 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..
ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-వి డిస్‌ప్లేను అందించనున్నారు.
మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.
స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.
 5జీ, వైఫై, బ్లూటూత్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్‌యూఐ కోర్ 4.1 ఆపరేటింగ్ సిస్టంపై శాంసంగ్ గెలాక్సీ వైడ్ 6 పని చేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే..
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news