ఆనాడైనా.. ఈనాడైనా.. ఏనాడైనా తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే అని బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది. తెలంగాణ కు ఒకప్పుడు పనికిమాలిన ప్రాంతం అని పేరు పెట్టారు. 90వేలు ఉన్న తలసరి ఆదాయాన్ని 3వేల వరకు పెంచుకున్నాం. పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకున్నామని తెలిపారు.
బీఆర్ఎస్ నేతలు పదవులను త్యాగం చేశారు. 14 ఏళ్లు కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామని చెప్పి మనల్నీ ఏడిపించిందన్నారు. పదేళ్లలో అద్భుతమైన పనులు చేసి చూపించామని తెలిపారు. ఆనాడు పదవుల కోసం కాంగ్రెస్, టీడీపీ నేతలు పెదవులు మూశారని గుర్తు చేశారు. బలవంతంగా తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేసింది జవహర్ లాల్ నెహ్రునే. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్ గా తీర్చిదిద్దామని తెలిపారు. ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు తెలంగాణ అనే పదాన్ని నిషేదించారని గుర్తు చేశారు. తెలంగాణ వస్తే.. కారు చీకట్లు అవుతాయని ఆంధ్రా ముఖ్యమంత్రులు పేర్కొన్నారు. వార్ల నోర్లు మూయించి 24 గంటల ఉచిత విద్యుత్ ని అందించామని గుర్తు చేశారు.