కాంగ్రెస్ పార్టీకి మరో షాక్… పార్టీకి మాజీ ఎమ్మెల్సీ గుడ్ బై…!

-

హుజూరాబాద్ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కల్లోలం రేపుతున్నాయి. అవమానకర రీతిలో కాంగ్రెస్ ఓడి పోవడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏకంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపైనే నేరుగా విమర్శానాస్త్రాలు ఎక్కుపెట్టారు. మరికొందరు బహిరంగంగానే పార్టీ తీరుపై విమర్శిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని వేరే పార్టీ వైపు చూస్తున్నారు.

తాజాగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ ప్రేం సాగర్ రావు కూడా కాంగ్రెస్ పార్టీని విడిచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన తన అనుచరులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీని విడిచి వేరే పార్టీలో చేరుతారని కార్యకర్తల సాక్షిగా చెబుతారనే ప్రచారం జరుగుతోంది. ఇవ్వాల జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులను పార్టీ పట్టించుకోవడం లేదని.. కొత్త వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేయాల్సిందే అని.. ఈనెల 10 వరకు అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూస్తామని.. లేకపోతే తమ దారి తాము చూసుకుంటామని హెచ్చిరించారు. అవసరమైతే కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రేం సాగర్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version