పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో… కాంగ్రెస్ పార్టీ కీలక నిర్నణం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో మాట్లాడుతుండగా కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ పార్టీ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా… వాకౌట్ చేశారు ఎంపీలు.
ఇక దీనిపై కాంగ్రెస్ రాజ్య సభ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ, “రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడటానికి బదులుగా కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపణలు చేశారు. అందుకే మేము ధన్యవాద తీర్మానం, ప్రధానమంత్రి ప్రసంగం నుండి వాకౌట్ చేసాము.” అని పేర్కొన్నారు. ప్రధాని మోడీ.. కాంగ్రెస్ పార్టీపై ఓ నియంత లా మాట్లాడారని మల్లి కార్జున ఖర్గే ఫైర్ అయ్యారు.
ఇది ఇలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. రాజ్య సభలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ లేకుంటే దేశంలో ఎమర్జెన్సీ జరిగేది కాదని విరమర్శించారు. కాంగ్రెస్ లేకుంటే దేశంలో సిక్కుల ఊచకోతలు ఉండేవి కాదని ప్రధాని అన్నారు. వారసత్వ రాజకీయాలు దేశానికి ప్రమాదకరంగా మారిందని.. వారి ఆలోచనలు అర్బన్ నక్సైలైట్ లాగా ఉన్నాయని విమర్శించారు. దేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరంగా మారిందని సంచలన విమర్శలు చేశారు.