కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటన చేశారు. కాసేపటి క్రితమే… కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే నా లక్ష్యం.. మీ అందరి సహకారం నాకు చాలా అవసరం.. నాపై నమ్మకం ఉంచిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు అన్నారు కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. సోనియా నేతృత్వంలో రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
సోనియా ఎన్నడూ పదవులు ఆశించలేదు.. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని నిప్పులు చెరిగారు. భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు ఖర్గే. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరం కలిసి పనిచేయాలని పేర్కొన్నారు.
In New India, hunger, pollution is increasing but Rupee is falling. Govt is sleeping but CBI, ED, and IT are working 24 hours. In new India, Godse is called a patriot & Mahatma Gandhi is an anti-national. They want to bring constitution of RSS: Congress Pres Mallikarjun Kharge pic.twitter.com/u5MvGYD7wc
— ANI (@ANI) October 26, 2022