రాహుల్ గాంధీ వీలు చిక్కినప్పుడల్లా కేంద్రంపై విమర్శలకు దిగుతున్నారు. ట్విట్టర్ లో కేంద్రం తీరుపై విమర్శలు ఎక్కు పెడుతున్నారు. గతంలో ఎన్నికలు ముగిసిన తర్వాత… ఎన్నికల ఆఫర్ ముగిసింది, పెట్రోల్ ధరలు పెరగవచ్చు, మీ వాహనాల ట్యాంకులు ఫుల్ చేయించుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజాగా మరో సారి కేంద్రంపై సెటైర్లు వేశారు రాహుల్ గాంధీ. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించిన హంగర్ ర్యాంకింగ్లో ఇండియా 101వస్థానంలో, ఫ్రీడమ్ ర్యాంకింగ్ లో 119, హ్యాపీనెస్ ర్యాంక్ లో 136 స్థానంలో ఉందని గుర్తు చేశారు. కానీ మేము ద్వేషం, కోపం చార్ట్ లో మొదటిస్థానంలో ఉండవచ్చని సెటైరికల్ ట్విట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే 5 రాష్ట్రాల ఓటమి బాధ నుంచి బయటపడుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళనకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే జీ 23నేతలు ఇచ్చిన సిఫారసులను సోనియా గాంధీ ఆమోదించేలా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో అనేక మార్పులు చేర్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Hunger Rank: 101
Freedom Rank: 119
Happiness Rank: 136But, we may soon top the Hate and Anger charts! pic.twitter.com/pJxB4p8DEt
— Rahul Gandhi (@RahulGandhi) March 19, 2022