కాంగ్రెస్ పార్టీ నిలబడదు అంటున్న కపిల్ సిబాల్

-

2022 లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఘోరమైన పరాజయాలు చవిచూసిన తర్వాత ఆ పార్టీ సీనియర్ నాయకుల్లో అంతర్మథనం మొదలైంది అని తెలుస్తోంది.

 

గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కలిసి పార్టీ పని తీరు మీద విమర్శలు చేస్తున్న పట్టించుకోకుండా వారిని దూరం పెడుతున్న విషయం తెలిసిందే.

 

తాజాగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిర్వహించిన పార్టీ అఖిల పక్ష భేటిలో సీనియర్లు రెచ్చిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ రానురాను ఎన్నికల్లో ఫేలవమైన ప్రదర్శన కనబరుస్తున్న పార్టీ అధినాయకత్వం మాత్రం  దృష్టి సారించడం లేదని వాపోయారు.

 

పార్టీ సమావేశం తర్వాత సీనియర్ నేత కపిల్ సిబాల్ తీవ్రస్థాయిలో పార్టీ మీద మండిపడ్డారు. జాతీయ కాంగ్రెస్ పరిస్థితి ప్రాంతీయ పార్టీల కంటే దారుణంగా ఉందని ఎన్నికల్లో ఒక్కో రాష్ట్రాన్ని కోల్పుతూ తన ఉనికిని ప్రశ్నర్థకం చేసుకుంటుంది అని పేర్కొన్నారు.

 

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2.33 ఓట్ల శాతం సాధించగా , పంజాబ్ లో ఏకంగా అధికారం కోల్పోయిన అంశాలను ముఖ్యంగా చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news