ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

-

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు పన్నిన కుట్రను బీహార్ పోలీసులు చేధించారు. జూలై 6, 7 తేదీల్లో ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా సమావేశాలు జరిపారు. దీంతో అనుమానిత ఉగ్రవాదులున్న పుల్వారి షరీఫ్ కార్యాలయంలో బీహార్ పోలీసులు దాడులు నిర్వహించారు. పాట్నాలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. 2047 నాటికి భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా చేయాలన్నదే ఉగ్రవాదుల లక్ష్యం అని, అలాగే ప్రధాని మోదీ రెండో లక్ష్యంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

జూలై 12 న ప్రధాని పర్యటన సందర్భంగా ఆయననీ లక్ష్యంగా చేసుకోవాలని ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు బీహార్ పోలీసులు ప్రకటించారు. అస్ధార్ పర్వేజ్, జలీలుద్దిన్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని పర్యటనకు 15 రోజుల ముందు పాట్నాలోని ప్రాంతంలో వీరు శిక్షణ పొందినట్లు తెలుసుకున్నాడు. ఆ ప్రాంతంలో కొన్ని డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. పుల్వారీ షరీఫ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు సమాచారం ఇంటెలిజెన్స్ బ్యూరో కి తెలియడంతో బీహార్ పోలీసులకు, ఎన్ఐఏకు సమాచారం ఇచ్చింది. కేరళ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు తో పాటు పలు రాష్ట్రాల నుంచి యువకులు ఉగ్రవాద శిక్షణ తీసుకునేందుకు ఇక్కడికి వచ్చేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version