వంట నూనె వినియోగదారులకు రిలీఫ్.. కేంద్రం కొత్త రూల్స్..!

-

వంట నూనెకి సంబంధించి ఎన్నో మార్పులు వస్తూనే ఉంటాయి. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ ని తీసుకు వచ్చింది. వంట నూనె రూల్స్ ని మార్చింది. కుకింగ్ ఆయిల్ ప్యాకేజింగ్ నిబంధనలలో మార్పులు చేసింది. పూర్తి వివరాల లోకి వెళితే..

ఈ రూల్స్ కంపెనీలకు, దిగుమతి దారులకు, ప్యాకర్లకు వర్తిస్తాయి. ఈ రూల్స్ వలన మోసాలు ఇంకా జరగలేవు. దీనితో వినియోగదారులకి రిలీఫ్ కలిగింది అనే చెప్పాలి. ఇక నుండి వంట నూనె నికర పరిమాణాన్ని ఉష్ణోగ్రత లేకుండా అన్ని కంపెనీలు కూడా చెప్పాలి. ఎందుకు అంటే వివిధ ఉష్ణోగ్రతల వద్ద వంట నూనె బరువు వేరు వేరుగా ఉంటుంది. ఒకేలా ఉండదు.

ఈ విధంగా కంపెనీలు మోసాలు చేస్తున్నాయి ఈ కొత్త రూల్స్ వలన ఇక నుండి అలా జరగవు. వంట నూనె బరువులో ఉష్ణోగ్రతను కాకుండా నికరంగా ఎంత పరిమాణం ఉందో లేబులింగ్ చెయ్యాలి కంపెనీలు. అదే లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్ 2011 ప్రకారం చూస్తే ప్రీ ప్యాకేజ్ వస్తువుల పై ప్రామాణికంగా నికర బరువు, పరిమాణాన్ని కంపెనీలు తెలపాల్సి ఉండేది.

అలానే వెజిటబుల్‌ ఆయిల్‌ తయారీ కంపెనీలు అయితే ప్యాకింగ్‌ సమయం లో ఉండే ఉష్ణోగ్రతను కలిపి బరువు, పరిమాణాన్ని చెబుతున్నాయి అని మంత్రిత్వ శాఖ చెప్పింది. అన్ని కూడా ఒకేలా వుండవు. ఎడిబుల్ ఆయిల్, వనస్పతి ఒక్కోటి ఒక్కో బరువుతో ఉంటాయి. పరిమాణం కూడా మారుతుంది. దీని కోసమే నూనె తయారీదారులు ఉష్ణోగ్రతను పేర్కొనకుండా ఉత్పత్తులను ప్యాక్ చేయాలని కొత్త రూల్స్ ని అమలు చేసారు. 2023 జనవరి 15 నుంచి ఇవి అమలు లోకి వస్తాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version