చాపకింద నీరులా విజృంభిస్తున్న కరోనా నెలరోజుల్లో ఎన్ని కేసులంటే?

-

గతంలో కరోనా ప్రపంచాన్ని ఎంతలా ఇబ్బంది పెట్టిందో తెలిసిందే… ఇప్పటికీ కరోనా పేరు వింటేనే ప్రాణభయం తన్నుకువస్తుంది. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ ఒక కీలక విషయాన్ని బయటపెట్టింది. ఇంగ్లాండ్ మరియు అమెరికా దేశాలలో కరోనా లో EG.5.1 (ఎరిక్) వేరియంట్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచం మొత్తంగా జులై 10 నుండి ఆగష్టు 6 తేదీల మధ్యన కొత్తగా మరో 15 లక్షల కేసులు నమోదు అయినట్లుగా రిపోర్ట్స్ తెలియచేస్తున్నాయి. ఇక ఇందులో కరోనా తో పోరాడుతూ మరణించేవారి సంఖ్య 2500 గా ఉంది. ఇక గత నెలతో పోల్చి చూస్తే ఆగస్టు లో 80 శాతం వరకు కేసులు మరియు 57 శాతం మరణాలు పెరిగినట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా కరోనా అస్సలు ఈ ప్రపంచం లోకి వచ్చిన రోజు నుండి ఆగస్ట్ 6 వరకు నమోదు అయిన కేసులు 769 మిలియన్ లుగా ఉండగా, మరణాల సంఖ్య 6 .9 గా నమోదు అయినవి. ముందు ముందు మరిన్ని కేసులు నమోదు కాకుండా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version