వెస్టిండీస్ సిరీస్ ముందు టీమిండియా భారీ షాక్ తగిలింది. టీమిండియా ఆటగాళ్లు వరుసగా కరోనా బరిన పడ్డారు. ముగ్గురు ఆటగాళ్ల తో పాటు ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తెలడంతో టీమిండియాలో ప్రకంపనలు సృష్టించాయి. కాగ ఫిబ్రవరి 6 నుంచి టీమిండియా, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బయో బబుల్ వెళ్లే ముందు టీమిండియా ఆటగాళ్లకు, సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
ఈ టెస్టులో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తో పాటు యువ సంచలనం రుత్ రాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యార్ లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే మరో ఐదుగురు సిబ్బందికి కరోనా సోకింది. కాగ ఎట్టి పరిస్థితుల్లో ఈ సిరీస్ ను నిర్వహిస్తామని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. కాగ ఈ నెల 6 న వెస్టిండీస్, టీమిండియా మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ టీమిండియా కు 1000 వ మ్యాచ్ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మ్యాచ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన ధావన్, రుత్ రాజ్ గైక్వాడ్ తో పాటు శ్రేయస్ అయ్యార్ దూరంగా ఉండనున్నారు.