వాలెంటైన్స్ డే రోజున ప్రేమికులు కోరుకునే సందర్శన ప్రదేశాలివే..

-

మీలో నిక్షిప్తమైన ప్రేమని మీరు ప్రేమించిన వారి ముందు ఉంచడానికి ప్రత్యేకమైన రోజు రానే వచ్చింది. ఫిబ్రవరి వస్తుందంటే తమలో ప్రేమని వెల్లడి చేసే సమయం వచ్చేసిందని, తమలోని ప్రేమని ఎలా చెప్పాలా అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రేమ అనేది ఆడా మగా మధ్య బంధమే కాదు. ఇద్దరు మనుషుల మధ్య మాటలు. కమ్యూనికేషన్. ఈ ప్రకృతిలో భాగమైన మనిషికి తోడు కావాలి. అది అపోజిట్ సెక్సే కానవసరం లేదు. ఒక దీవిలో ఒంటరిగా కూర్చున్నప్పుడు తీరాన్ని తాకే అలలు కూడా ప్రేమ గీతాన్ని పాడుతున్నట్టుగా వినిపిస్తాయి.

అదంతా అటుంచితే ఈ సంవత్సరం ప్రేమికుల రోజు ఆదివారం రోజున వస్తుండడంతో చాలా మందికి కలిసొచ్చింది. అందుకే తమ ప్రేమని వెల్లడి చేసేందుకు మంచి మంచి సందర్శన స్థలాల కోసం చూస్తున్నారు. భారత దేశంలో ఇప్పటికే చాలా ప్లేసెస్ బుక్ అయిపోయాయి. బుకింగ్. కామ్ ప్రకారం టాప్ టెన్ లో ఉన్న నగరాల్లో ఢిల్లీ, గోవా, ముంబై మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

వారాంతాన్ని ప్రేమించినవారితో హాయిగా గడపడానికి ప్రత్యేకమైన నగరాల్లో ఢిల్లీ టాప్ లో నిలిచింది. ఇక సముద్ర తీర నగరాలైన గోవాకి వెళ్ళడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కర్ణాటక లోని దేవన హళ్ళి, హంపి, పుదుచ్చేరి (తమిళనాడు), జోధ్ పూర్ (రాజస్థాన్) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఐతే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సందర్శకుల తాకిడి తక్కువగా ఉందని బుకింగ్. కామ్ తెలిపింది.

కరోనా కారణంగా పర్యాటకానికి రావడానికి చాలా మంది భయపడుతున్నారని, దానివల్ల ఇంతకుముందు కంటే తక్కువ మంది వస్తున్నారని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news