ఇండియాలో కొత్తగా 12,591 కరోనా కేసులు, 32 మరణాలు

-

భారత దేశంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఇండియా వ్యాప్తంగా 12,591 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా.. 32 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 62,286 యక్టీవ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4.48 కోట్ల కేసులు నమోదు కాగా, 5.31లక్షల మంది మృతి చెందారు.

కేరళ,కర్ణాటక,తమిళనాడు,మహారాష్ట్ర,గుజరాత్,ఢిల్లీ,హర్యానా,యుపి,రాజస్థాన్,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి కోవిడ్ కేసులు. దేశంలో 4.39 శాతంగా ఉన్న రోజువారీ పాజిటివిటీ రేటు నమోదు అయింది. అలాగే.. ఒమిక్రాన్ వేరియంట్ XBB.1.16 వల్ల దేశంలో పెరుగుతున్నాయి కోవిడ్ కేసులు.

ఇక ఇటు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే.. తెలంగాణలో ఇవాల్టి నుంచి మరోమారు బూస్టర్ డోస్‌ల పంపిణీకి సన్నద్ధమైంది. గత కొంత కాలంగా కోవిడ్ వ్యాక్సిన్‌ల కొరత కారణంగా బూస్టర్ డోస్‌ల పంపిణీ నిలిపోయింది. కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రాలే స్వయంగా కోవిడ్ వ్యాక్సిన్‌లు కొనుగోలు చేయాలని ఇటీవల సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news