ఆగస్ట్ 26 నుంచి మూడురోజుల పాటు విశాఖలో సీపీఐ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ,ఆర్థిక పరిసథితులపై చర్చించి తీర్మానం చేస్తామని…రాష్ట్ర రాజకీయ నేతల్లో నైతికత లేకుండా పోతోందని వెల్లడించారు. దళిత యువకుడుని హత్య చేసిన ఎమ్మెల్సీ, బ్లూ ఫిల్మ్ చూపించిన ఎంపిని సిఎం జగన్ వెనకేసుకువస్తున్నారన్నారు.
గోరంట్ల మాధవ్ క్షమాపణలు చెప్పాల్సిందిపోయి కులం పేరిట విమర్శలు తగదు… తన పార్టీ నేతల నీచ చేష్టలపై సిఎం నోరువిప్పకపోవడం దారుణం అని పేర్కొన్నారు. బిజెపి ఏకచత్రాధిపత్యానికి బీహార్ లో గండి పడిందన్నారు. బిజెపి వ్యతిరేక శక్తులను వామపక్షాలు ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని… స్వాతంత్ర దినోత్సవం పేరిట జెండా దోపిడీకి మోడీ ప్రభుత్వం పాల్పడిందన్నారు. ఖాదీ జెండాలనే వాడేలా చేసిఉంటే చేనేత కార్మికులకు లబ్ధి చేకూరేదని తెలిపారు. మోడీ పాలనలో దేశం తిరోగమనం లో పయనిస్తుందన్నారు.