ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సిపిఐ నారాయణ. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకుంటామని వామపక్షాలు ప్రకటించడంతో.. సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణను అదుపులోకి తీసుకున్నారు నగరి పోలీసులు. నగరీ పోలీస్ స్టేషన్ లో ఉన్న సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉప రాష్ట్రపతి పదవి అనేది శాశ్వతం కాదని.. పదవి పోయినాక ఆంధ్ర రాష్ట్ర ప్రజల మధ్య తిరగలేరని, తిరిగితే తాము వదలబోమని హెచ్చరించారు నారాయణ. అమీత్ షా రాకతో శ్రీకాళహస్తి మొదలుకొని నగరి వరకు అప్రకటిత లాక్డౌన్ విధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి, ఈ రోజు ప్రత్యేక హోదా పై నోరు మెదపకుండా ఏపీలో అడుగుపెడుతున్న అమీత్ షాకు సిగ్గు లేదా అని ప్రశ్నించారు.
దేశ వ్యాప్తంగా రైతులు ఉద్యమాలు చేస్తుంటే ఉద్యమాలను పక్కదోవ పట్టించేందుకు హిందూ మతోన్మాదాన్ని రెచ్చకొడుతున్న ఇలాంటి ఉగ్ర మూకలకి ఆంధ్ర రాష్ట్రం లోకి ప్రవేశించి నైతిక హక్కు లేదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని అమిత్ షా తో వెంకయ్యనాయుడు మాట్లాడాలని ఫైర్ అయ్యారు. భారతదేశం ద్వితీయ పౌరుడిగా ఉన్న వెంకయ్య నాయుడు సూచనను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కానీ దీనిపై మాట్లాడకోవడం దారుణమన్నారు.