సోము వీర్రాజును ఇకనుంచి సారాయి వీర్రాజు అని పిలవాలి : సిపిఐ కౌంటర్

-

నిన్న కమ్యూనిస్టు నేతలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు మతిభ్రమించినట్లున్నదని.. సోము వీర్రాజును ఇకపై సారాయి వీర్రాజుగా పిలవాలేమో! అంటూ చురకలు అంటారు.

బీజేపీ అధికారంలోకొస్తే చీప్ లిక్కర్ కారుచౌకగా అందిస్తామని వీర్రాజు వ్యాఖ్యానించడం దుర్మార్గమని.. రాష్ట్ర ప్రజలు మద్యనిషేధం కోరుతుంటే, బీజేపీ మాత్రం మద్యం ఏరులుగా పారిస్తానంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటి మంది మందుబాబులు ఉన్నారని, వారంతా బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పటం వీర్రాజు పిచ్చికి పరాకాష్ట చేరిందని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు సిపిఐ రామకృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేని భారతీయ జనతా పార్టీ ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బిజెపి పార్టీ నాయకులంతా మూర్ఖుల అని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version