క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? కొత్త రూల్స్ ని చూడండి మరి..!

-

చాలా మంది క్రెడిట్ కార్డ్స్ ని ఉపయోగిస్తూ వుంటారు. క్రెడిట్ కార్డు వలన ఎంతో ఈజీగా పేమెంట్ చెయ్యచ్చు. అయితే క్రెడిట్ కార్డ్స్ కి సంబంధించి కొత్త రూల్స్ వచ్చాయి. ఈ రూల్స్ ని ఏప్రిల్ నెలలో తీసుకు రావడం జరిగింది. నేటి నుండి ఇవి అమలులోకి రానున్నాయి.

పూర్తి వివరాలను చూస్తే… క్రెడిట్ కార్డు క్యాన్సిలేషన్, బిల్లింగ్, క్రెడిట్, డెబిట్ కార్డు టోకెనైజేషన్ వంటి వాటిలో మార్పులు ఉన్నాయి. క్రెడిట్ కార్డు విషయంలో ఈ రూల్స్ ని తెచ్చారు. అయితే క్రెడిట్ కార్డును అందించిన బ్యాంక్ యాక్టివేట్ కోసం కార్డుదారుని నుంచి వన్ టైమ్ పాస్‌వర్డ్ ఆధారిత అనుమతి తీసుకోవాలి.

ఒకవేళ ముప్పై రోజుల్లో యాక్టివేట్ చేయకపోతే ఎలాంటి చార్జెస్ లేకుండా క్లోజ్ చేసేయాలి. కార్డు లిమిట్ ని పెంచేందుకు కూడా పెర్మిషన్ తీసుకోవాలి. ఇక నుండి కార్డుహోల్డర్ల అనుమతి లేకుండా క్రెడిట్ కార్డు పరిమితిని పెంచరు. అలానే బిల్లులపై కాంపౌండింగ్ వడ్డీలనూ కంపెనీలు అక్టోబర్ 1 నుంచి విధించకూడదు.

మినిమమ్ అమౌంట్ రూల్స్, ఛార్జీలను కూడా క్రెడిట్ కార్డు ఇచ్చేవాళ్ళు చెప్పాలి. అంతే కాక ఈ టోకెనైజేషన్ ద్వారా ఆన్‌లైన్ మోసాలు జరగకుండా చూస్తున్నారు. కనుక క్రెడిట్ కార్డులను కలిగిన వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ ని ఉపయోగించే వాళ్ళు వీటిని గమనిస్తే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version