రైల్వే స్టేషన్ లో బాలికపై అత్యాచారం

నిర్భయ, దిశ లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామంతో కళ్ళు మూసుకుపోయిన దుర్మార్గులు దారుణాలకు ఒడిగడుతున్నారు. పసి పెద్దలు మొదలుకొని వృద్ధులను సైతం వదలడం లేదు. దేశం లో ఏదో ఒక మూలన అమ్మాయిలపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ రైల్వేస్టేషన్ లో ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన వెలుగు చూసింది.

గుజరాత్ కి చెందిన 17 ఏళ్ల బాలిక, తన స్నేహితుడు దీపక్ తో కలిసి ఢిల్లీకి వచ్చింది. ఆదివారం తిరిగి గుజరాత్ వెళ్లే గ్రామంలో వారి మధ్య చిన్న పాటి గొడవైంది. దీంతో ఆమెని రైల్వే స్టేషన్ లోనే వదిలి దీపక్ వెళ్లిపోయాడు. ఒంటరిగా ఉన్న బాలికపై రైల్వే స్టేషన్ లో వాటర్ బాటిల్లు అమ్ముకునేే హర్దీప్, రాహుల్ అనే ఇద్దరు యువకులు పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం వారిని అరెస్టు చేశారు.