RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాకు వెళ్తుండగా ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

-

టాలీవుడ్‌ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్ట‌ర్ ఎస్ ఎస్ రాజ‌మౌళి కాంబినేషన్ లో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ రోజు పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల అయిన విషయం తెలిసిందే. బెనిఫిట్ షోల‌తో ఒక రోజు ముందు నుంచే మెగా, నంద‌మూరి ఫ్యాన్ ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. అభిమానులు, సెల‌బ్రెటీలు అని తేడా లేకుండా.. అంద‌రూ ఈ సినిమా చూడ‌టానికి క్యూ క‌డుతున్నారు.

accident
accident

అయితే.. ఈ మూవీ విడుదల నేపథ్యంలో ఓ విషాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా వి. కోట దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా బెనిఫిట్‌ షోకు వెళుతున్న యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

ఈ సంఘటనలో ఏకంగా ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదల సందర్భంగా అర్ధరాత్రి బెనిఫిట్‌ షో టికెట్ల కోసం వి. కోటకు వెళ్లిన వీరు టికెట్లు దొరకకపోవడంతో.. అక్కడ నుంచి వెనుదిరిగారు. ఆ సమయంలోనే ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొట్టాయి. దీంతో ఆ ముగ్గురు యువకులు మరణించారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news