స్నేహితుడని ఇంటి పిలిచాడు..ఆ తర్వాత భార్యతోనే సెక్స్ కు ప్రయత్నం చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… బెలగావి జిల్లా చిక్కోడి తాలూకా కరోషి గ్రామానికి చెందిన సునీల్ (25), జైనపురాకు చెందిన మహంతేషులు మంచి స్నేహితులు. ఇటీవల మహంతేష్ భార్యతో సునీల్ అసభ్యంగా ప్రవర్తించాడు.
దీంతో, ఆగ్రహానికి గురైన మహంతేష్ ఈనెల 2న మాట్లాడాలి అని చెప్పి అతడిని ఇంటికి పిలిపించుకున్నాడు. అనంతరం, కరోషి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పీకల దాకా సునీల్ కు మద్యం తాగించాడు.
అప్పటికే ఆగ్రహంతో రగిలిపోతున్న మహంతేష్, మద్యం మత్తులో ఉన్న సునీల్ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఏమీ తెలియనట్టు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కాగా, అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో, మహంతేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.