ఏపీలో దారుణం..కన్న కొడుకుని హత్య చేయించిన తండ్రి !

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకుని తండ్రి హత్య చేయించారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. మదనపల్లి మండలం తంబళ్లపల్లి మండలం కుతికిబండ తండాకు చెందిన రెడ్డప్ప నాయక్ ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు ఠాగూర్ నాయక్ ను ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు.

చెడు వ్యసనాలు గంజాయి కి బానిసైన ఠాగూర్ నాయక్ డబ్బుల కోసం తండ్రిని వేధించేవాడు. తండ్రి డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వకపోవడంతో ఇంట్లో ఉన్న వస్తువులను, బంగారు నగలు, సామాన్లు దొంగలించి జల్సాలు చేసేవాడు. ఈ విషయమై తండ్రి రెడ్డప్ప నాయక్ అతని కుమారుడు ఠాగూర్ నాయక్ ను తీవ్రంగా మందలించాడు.

దీంతో తండ్రిని చంపేస్తానని ఠాగూర్ నాయక్ హెచ్చరించడంతో రెడ్డెప్ప నాయక్ భయపడ్డాడు. తన బావమరిది ఇంకొక వ్యక్తికి రెండు లక్షలు కిరాయి ఇచ్చి తన కన్న కొడుకుని చంపాలని పురమాయించాడు. ఈ క్రమంలో ఠాగూర్ నాయక్ మదనపల్లి కి వచ్చిన సందర్భంగా పట్టణ శివారులోని గుట్టల్లోకి తీసుకెళ్లి అతని మెడకు తీగలు చుట్టి హత్య చేయించారు. ఈ ఘటనపై మదనపల్లి టూ టౌన్ సిఐ మురళీకృష్ణ కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేయగా, అసలు విషయం బయటపడింది