సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం ఘటనలో నివేదిక సిద్ధం చేసిన FSL

ఈ ఏడాది జూన్ 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ అభ్యర్థులు అగ్నిపథ్ కి వ్యతిరేకంగా విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్ల కారణంగా రూ. 7 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. నిరసనకారులు నాలుగు భోగిలను తగలబెట్టారు. ఈ అల్లర్లలో 30కి పైగా భోగిలో అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ కేసులో 70 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి సెల్ ఫోన్ లను సీజ్ చేశారు.

వాట్సాప్ గ్రూప్ లలో స్టేషన్ పై దాడికి సంబంధించిన చర్చని గుర్తించారు. ఈ విధ్వంస ఘటనపై నమోదైన కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక సిద్ధమైంది. ఈ కేసులో ఆర్మీ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు సుబ్బారావుతో సహా 70 మంది పై పోలీసులు త్వరలోనే చార్జి షీట్ దాఖలు చేయనున్నారు. అరెస్ట్ అయిన వారి సెల్ ఫోన్ లను ఎఫ్ఎస్ఎల్ కి రైల్వే పోలీసులు పంపించగా దీనికి సంబంధించిన నివేదిక సిద్ధమైంది.