కారులో విగతజీవిగా ఫేమస్ సింగర్.. హత్యా, ఆత్మహత్యా..?

-

ఇటీవల కాలంలో సెలబ్రిటీల ఆకస్మిక అనుమానాస్పద మరణాలు ఎక్కువవుతున్నాయి. ఇందులో కొన్ని ఆత్మహత్యలుగా తేలుతుంటే.. మరికొన్ని మాత్రం హత్యలుగా తేలి అందర్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలే బిగ్​బాస్ ఫేం, టిక్​టాక్ స్టార్ సోనాలి ఫొగాట్ అనుమానాస్పద మరణం హత్యగా పోలీసులు నిర్ధరించారు. ఇంతలోనే మరో సింగర్ అనుమానాస్పద మరణం గుజరాత్​లో కలకలం రేపింది.

గుజరాత్​లోని వల్సాద్ జిల్లాలో ప్రముఖ గాయని వైశాలి బల్సారా మృతదేహం అనుమానాస్పద రీతిలో ఓ కారులో లభ్యమైంది. పార్​ నదీ ఒడ్డున ఓ కారు చాలాసేపు ఆగి ఉంది. అది గమనించిన స్థానికులు.. కారు డ్రైవర్ చుట్టుపక్క ప్రాంతంలో ఉన్నాడేమోనని వెతికారు. ఎక్కడా ఎవరూ కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన ప్రజలు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారు డోర్​ ఓపెన్​ చూడగా బ్యాక్​ సీట్​లో ఓ మృతదేహం కనిపించింది. వల్సాద్​కు చెందిన ప్రముఖ గాయని వైశాలి బల్సారా మృతదేహంగా పోలీసులు గుర్తించారు. శవపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

వైశాలి భర్త హితేశ్​ కూడా గాయకుడే. ఇద్దరూ కలిసి పలు స్టేజ్​ షోల్లో పాల్గొన్నారు. శనివారం అర్ధరాత్రి 2 గంటలకు తన భార్య కనిపించడం లేదని హితేశ్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఆదివారం ఉదయం వైశాలి మృతదేహం లభ్యమైంది. అయితే ఇది హత్యనా లేక ఆత్మహత్యనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version